సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో బుధవారం సబ్ కోర్టు , కోర్టు భవనం సాధన కొరకు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సి.ఐ. టి.యు సంఘము తరుపున సంఘీభావం తెలిపినారు. ఈ సందర్బంగా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి మాట్లాడుతూ గజ్వెల్ ప్రాంతంలో జిల్లా కోర్టు సాధన ,సబ్ కోర్టుసాధన , కోర్టు భవనం సాధన గజ్వెల్ కు అత్యంత అవసరమని గజ్వెల్ స్వంత నియోజకవర్గమములో మిగితావి ఏట్లా అభివృద్ధి చేసి మోడల్ గా ఉంచాలనుకుంటున్నారో గజ్వేల్ ప్రాంతంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన భవనాలు సబ్ కోర్టు, జిల్లా కోర్టు గాని రిలే నిరాహార దీక్షను గుర్తించి వెంటనే సమస్యలు పరిష్కరించే విదంగా ప్రభుత్వం కృషిచేయాలనీ లేని పక్షంలో ప్రజాసంఘాలు తరుపున ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున సమస్యలు సాధించేవరకు సిఐటియు తరఫున పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు బిక్షపతి, కుతుభోద్దీన్, చెంద్రశేఖర్ రెడ్డి, మల్లయ్య, వెంకటేశం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, సీనియర్ న్యాయవాదులు ,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
