Breaking News ప్రాంతీయం

కార్యదర్శిపై కేసు నమోదు…

155 Views
 ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే ఫిర్యాదు రావడంతో అతనిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోండాపూర్ గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ ఇంటి నంబర్ 6–86 ఉండగా దానిని 6–88 అనే తప్పుడు నంబర్ను కార్యదర్శి రాజేశ్వర్ సృష్టించారు. దీంతో బాధితుడు సిరిసిల్లా జిల్లా కలెక్టర్తో పాటు గ్రామస్తులకు బాధితుడు ఫిర్యాదు అంద చేశారు. గ్రామ సర్పంచ్ లెటర్ ఫ్యాడ్ ఉపయోగించి ఈ తప్పుడు నంబర్ను సృష్టించి పబ్బా శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆ స్థలాన్ని అప్పగించడంతో అతను కబ్జా చేశారనే ఫిర్యాదుతో కార్యదర్శి రాజేశ్వర్, మరో వ్యక్తి అయిన పబ్బా శ్రీనివాస్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ స్థలాన్ని కబ్జా చేసేలా అధికార దుర్వినియోగం చేసిన పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ కోరారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్