దౌల్తాబాద్: వీఆర్ఏలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చందా రాజు అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటబంది పద్ధతిలో వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తే వేల కుటుంబాల జీవితాలు ఆగమవుతాయని అన్నారు. టిడిపి హాయంలో క్రమ పద్ధతిలో ఎవరు పనిచేస్తున్నారో వారిని పర్మనెంట్ వీఆర్ఏలుగా రికార్డులో పేర్లు నమోదు చేశారని అన్నారు. ఇప్పటివరకు ఓట బంది వీఆర్ఏలుగా వంతుల వారిగా విధులు నిర్వహిస్తూ వేతనాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఏపీపీఎస్సి ద్వారా ప్రభుత్వం దాదాపు 3 వేల మంది వీఆర్ఏలను నియమించింది. గతంలో ఎన్నోసార్లు వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలంటూ ఉద్యమాలు నిరసనలు కొనసాగాయని వాటి ఫలితంగానే గతంలో ఇచ్చిన హామీ మేరకు క్రమబద్దీకరణ సమస్య కొలిక్కి వచ్చిందన్నారు. కుటుంబంలో ఒకే వ్యక్తికి ఉద్యోగం కట్టబట్టడం ద్వారా విధులు నిర్వహించే వేల కుటుంబాలకు ఆర్థిక నష్టం జరగడమే కాకుండా ఉపాధి కోల్పోతారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్తయ్య, వీఆర్ఏలు స్వామి, యాదగిరి, ఎల్లం, వెంకటేశం, బాలమణి తదితరులు పాల్గొన్నారు….
