ప్రాంతీయం

అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దు – సిపి

42 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*మానేరు బ్రిడ్జ్, కాల్వ శ్రీరాంపూర్ నిన్న జరిగిన ప్రమాద సంఘటన ప్రాంతాలను సందర్శించిన సీపీ.*

*అత్యవసరం పరిస్థితులలో తప్ప బయటకు రావద్దు*

*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూనారం గ్రామం చెరువు లో నిన్న జరిగిన మాత్స్య కారుడి గల్లంతు సంఘటన గురించి సీపీ గారు చెరువు సందర్శించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉసెన్మియా వాగు, గుంపుల వద్ద మానేరు వరద ఉదృతి ని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి, అత్యవసర పరిస్థితిలలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రత చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు చేయడం జరిగింది. అదేవిదంగా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ కారో బార్ గల్లంతైన మీర్జాపూర్ గ్రామ పరిధి కొత్తపల్లి నక్కల వాగు వద్ద నిన్న జరిగిన ప్రమాద ప్రాంతం ను సీపీ సందర్శించి సంఘటన గల వివరాలు ప్రజలను, అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., అధికారులకు సూచించారు.

*గుంపుల మానేరు బ్రిడ్జ్ పై ప్రమాదకరంగా ఉన్న సైడ్ సేఫ్టీ వాల్ ను మరమ్మత్తు చేపించాలని అధికారులకు సూచించారు*

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…. ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు చేయకూడదని సీపీ  సూచించారు.వర్షాలతో, వరద ప్రవహించే ప్రాంతాలలో, నదులు, కాలువలు, వంకలు, ప్రాజెక్ట్, జల పాతాల ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణా పొందిన సిబ్బంది తో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు టీమ్ ఎల్లపుడు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడం, లో లెవెల్ బ్రిడ్జ్ లు మునిగి రహదారుల ఫై నుండి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్య పడవద్దని,నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712656597, స్థానిక పోలీస్ వారికీ లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసువారి సహాయం పొందాలని అన్నారు. భారీ వర్షాల, వరదల వలన ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ గారు అధికారులను ఆదేశించారు. ప్రజలు, యువత అత్యవసరమైయితే తప్ప బయటకి రావద్దని ఉదృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపొర్లుతున్న వరద నీటిని, జలపాతం లను, చెరువులను, వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు.

సీపీ  వెంట పెద్దపల్లి చేతన ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ , స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకట్, పోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్