సోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్
ఎల్లారెడ్డిపేట ఆగష్టు 31 :
సోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం ఘనంగా జరిగాయి.
వయసు తారతమ్యం లేకుండా అందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటా రాఖీ పండుగ సందడి నెలకొంది. సుదూర ప్రాంతాలలో ఉన్న సోదరీమణులు తమ పుట్టిళ్లకు వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా తోబుట్టువులకు నూతన వస్త్రాలు , కట్నకానుకలు , బహతులుగా అందజేశారు ,
రాఖీ పౌర్ణమి, శ్రావణ గురువారం సందర్భంగా ఫ్యాన్సీ షాపులు, స్వీట్ స్టాల్సు, పండ్ల దుకాణాలు కొనుగోలు దారులతో సందడిగా కనిపించాయి.
‘నువ్వు నాకు రక్ష.. నీకు నేను’ రక్ష అంటూ రాఖీ లు కట్టారు,





