శ్రీ చైతన్య స్కూల్ లో ఫ్యాషన్ షో సెలబ్రేషన్స్
సిద్దిపేట జిల్లా గజ్వేల్,
జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుండి పదవ తరగతి విద్యార్థులకు కిడ్స్ ఫైర్ , ఫ్యాషన్ షో, సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి అల్లరించారు చిన్నారుల అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య డిజైన్లతో రూపొందించిన వస్త్రాలతో ప్రదర్శన నిర్వహించారు,సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి రూపొందించిన వస్త్రాలతో ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా తీర్చిదిద్దారు,యూకేజీ ఎల్కేజీ నర్సరీ చిన్నారులు ఆటపాటల డాన్సులతో చిందులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులలో చదువు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ,వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహింస్తూన్నట్లు చెప్పారు. ప్రగతికి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసినట్లు అవుతుందని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో ఫ్యాషన్ షోలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించవచ్చు అని వారికి ఆసక్తికరమైన అనుభవాన్ని కలిగిస్త కలిగించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
