మంచిర్యాల జిల్లా
డీజేఎఫ్ నూతన జిల్లా కమిటీ సమావేశం సోమవారం రామకృష్ణ పురం గ్రామంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాలను వివిధ మండలాలకు చెందిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో డి జె ఎఫ్ నూతన కమిటీ అధ్యక్షులు మోకనపల్లి బద్రి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పని చేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క జర్నలిస్టుకి గృహాన్ని లేదా ఇంటి జాగాలు అందించాలని విలేకరులపై నేడు దాడులకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ గత ప్రభుత్వ పాలనలో విలేకరులపై విరుచుకుపడ్డ ఆ ప్రభుత్వాన్ని నేల కూల్చడానికి రాతలచే మా విలేకరులు కూడా భాగస్వామ్యం వహించారని ప్రస్తుతం ఈ ప్రభుత్వం అది మరవకూడదని గుర్తుచేస్తూనే మంచిర్యాల జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరి సంక్షేమం కోసం నూతన పోకడలతో వివిధ మండలాలలో నూతన సభ్యత్వాలను పెంచుతూ విలేకరుల సంక్షేమం కోసం ఎప్పుడూ డీజేఎఫ్ ముందు ఉంటుందని తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా జనరల్ సెక్రెటరీ బర్ల తిరుపతి, జిల్లా ట్రెజరీ జనార్ధన్, జిల్లా ఉపాధ్యక్షులు కుశనపెల్లి సతీష్, జిల్లా కార్యదర్శి పసునూటి ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి జిల్లాపెళ్లి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి కిరణ్ మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వనపర్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.





