ముస్తాబాద్, సెప్టెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి):తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెలువరించినందున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల వారు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వివిధ గ్రామాలల్లో పాత కట్టేకప్పు ఇండ్లల్లో నివసిస్తువున్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముస్తాబాద్ ఆంధ్రప్రభ జర్నలిస్ట్ కస్తూరి వెంకట్ రెడ్డి అన్నారు. వర్షాల ప్రభావితం దృష్ట్యా విధ్యుత్ స్థంబాలను తాకకూడదని వర్షాలు వచ్చేసమయంలో చెట్లకింద ఉండకూడదని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.. ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోడ్ల వెంబడి వెళ్లకుండా ప్రధాన రహదారుల గుండా వెళ్లాలని ముఖ్య అవసరాలు ఉంటేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
