ముస్తాబాద్, సెప్టెంబర్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడడంతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలం రాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, కుంటలు జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ముస్తాబాద్ మండల పరిధిలోని రామలక్ష్మణపల్లి- పదిర మధ్య తాత్కాలిక వంతెనపై నుండి మానేరు నది పొంగి ప్రవహిస్తున్నందున ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ చేరుకొని బారికేడ్లు, జీపీ ట్రాక్టర్‌ను రాకపోకలకు అడ్డుగా ఏర్పాటు చేశారు.
