మంచిర్యాల జిల్లా : చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం.
మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,అధికారులు.
1,2,22 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.
రోడ్లు,డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లిన కాలనీల వాసులు.
సత్వరమే పరిష్కరించేవిధంగా కృషిచేస్తానని అధికారులను ఆదేశించిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి.
చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి కామెంట్స్,
మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తా.
ఒక్కొక్కటిగా ప్రియారిటీ పరంగా అభివృద్ధి పనులను చేపడుతం ప్రజలు కొంత ఓపిక పట్టాలి.
కమిషన్ భగీరథ పథకం పెద్ద అవినీతి పథకం.
కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పేరుతో వేల కోట్లు దండుకున్నాడు.
మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీళ్ళు మురికిగా వాసన రావడంతో ప్రజలు తాగలేక పోతున్నారు.
మందమర్రి మున్సిపాలిటీకి అమృత్ స్కీం కింద 30 కోట్లతో తాగునీటి పథకం ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
