రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండించిన ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుదవారం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అన్న రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ నేతృత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తూ దేశంలో నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతున్న సీఎం కేసీఆర్ అని రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు తగిన బుద్ది చెబుతారని కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని అన్నారు.
