ప్రాంతీయం

కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల వెంటనే చెల్లించాలి

149 Views

*కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల సమస్యను పరిష్కరించకుంటే సమ్మె తప్పదు.*

*నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలుపుతున్న కన్వేయన్స్ డ్రైవర్లు*

గట్టు మహేందర్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు డివిజన్ కార్యదర్శి.

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల సమస్య, పని భద్రత కల్పించే విధంగా సింగరేణి అధికారులు స్పందించాలని, లేనియెడల సెప్టెంబర్ 11 తర్వాత సమ్మెకు సిద్ధమైన కన్వేయన్స్ డ్రైవర్లు. అందులో భాగంగా ఈరోజు నల్ల రిబ్బన్లు ధరించి వారి నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా గట్టు మహేందర్ SCKS-CITU డివిజన్ కార్యదర్శి, కన్వేయన్స్ డ్రైవర్ యూనియన్ సిఐటియు ఫిట్ కమిటీ అధ్యక్షులు కాసిపేట రాజేశం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇచ్చే పూర్తి వేతనాలను డ్రైవర్లు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా అడిగితే ఎప్పుడు పని నుంచి తొలగిస్తారో అనే భయంతో ఓనర్లకు ఏదురు చెప్పలేని దుస్థితిలో ఈరోజు కన్వియన్స్ డ్రైవర్లు ఉన్నారు. కార్మికులకు పని భద్రత కల్పించే విధంగా అలాగే పూర్తి వేతనాన్ని కార్మికులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 11 తర్వాత స్వచ్ఛందంగా సమ్మెలోకి వెళ్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కన్వెయన్స్ డ్రైవర్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్