ప్రాంతీయం

పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ముదిరాజులు…

191 Views

ముస్తాబాద్, ఆగస్టు 30 శ్రావణ మాసం  శుక్రవారం కావడంతో అమ్మవారి దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు సమీపంలో గల పోచమ్మ ఆలయంలో ముందు పూజలు చేసి దర్శించుకుని మొక్కులు చెల్లించి ముదిరాజుల కుల బాంధవుల దేవత పెద్దమ్మ తల్లికి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు కుంకుమార్చనలు దీపారాధనలు ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని శుక్రవారం అంగరంగ వైభవపీతంగా మా కులదేవత పెద్దమ్మ తల్లికి పూజలు ఘనంగా నిర్వహిస్తామని అనంతరం మహ అన్నదాన కార్యక్రమం జరిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్