మంచిర్యాల జిల్లా
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమావేశం.
జైపూర్ మండలం పద్మశాలి సంఘం మార్త మారుతి ఆధ్వర్యంలో
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారం గ్రామం లో పద్మశాలి సంఘం మార్త మారుతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కామర్థపు మురళిని పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పద్మశాలి సంఘం నుండి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పిటిసిలుగా పోటీ చేయాలని మరియు రాజకీయంగా పద్మ పద్మశాలి సంఘం అభివృద్ధిలోకి రావాలని రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గడ్డం జగన్నాథం అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి, పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి మాచర్ల రామచందర్, మార్త మారుతి చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జ్, వేముల మల్లేష్ జైపూర్ మండల అధ్యక్షులు, ఆవిడకు గణేష్ మాజీ సర్పంచ్ శివారం, జైపూర్ మండలం మరియు గ్రామ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.





