రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం పులి పిల్లలు సంచరించినట్లు స్థానికులు తెలిపారు. శివంగాలపల్లి గ్రామ శివారులో ఓ రైతు పంట పొలాల్లోకి పులి పిల్లలు ప్రత్యక్షమయ్యాయని, స్థానిక రైతు ఉదయం లేచి పంట పొలంలోకి వెళ్లి పనులు చేస్తుండగా పులి పిల్లల శబ్దం రావడంతో వెళ్లి చూడగా రెండు పులి పిల్లలు ఆగుపడ్డాయని జంతు సంరక్షణ శాఖ అధికారులకు సమాచారం అందించామని వారు పేర్కొన్నారు.
