ప్రాంతీయం

రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం నిర్వహించిన …

121 Views

ముస్తాబాద్, మార్చి 14 (24/7న్యూస్ ప్రతినిధి): ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముదిరాజుల సంక్షేమం కోసం ముదిరాజ్ జాతి అభ్యున్నతి కోసం గత 40 సంవత్సరాల నుండి ఏ సమస్య అయినా తక్షణమే స్పందించి సహాయ సహకారం అందించుటలో ముందడుగులో ఉన్నారన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రత్యేక ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు అదేవిధంగా ముస్తాబాద్ ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు భారిఎత్తున హాజరై రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరి రాబోయే కాలంలో ముదిరాజుల చిరకాల స్వప్నమైనటువంటి బీసీడీ నుండి బీసీఏ గ్రూపులోకి మార్చి ముదిరాజుల పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే తరాల ముదిరాజ్ యువకుల అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వెనముల రేవంత్ రెడ్డి స్పందించి 15 జీవో అమలుపరిచి అదేవిధంగా బీసీడీ నుంచి బీసీ ఏలకు ముదిరాజ్ లను చేర్చాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found