తిమ్మాపూర్ న్యూస్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బొర్ర సతీష్ అనే యువకుడు (34) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ ఇంట్లో నుంచి ఉదయం ట్రాక్టర్ నడపడానికి బయలుదేరగా తిమ్మాపూర్ లోని ఆటోస్టాండ్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు.వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో గుండె పోటుతో మృతి చెందాడు.
మృతిడికీ భార్య రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున తీవ్ర ఆవేదనకు గురయ్యారు.నిరుపేద కుటుంబానికి చెందిన మృతుడు సతీష్ కూలి పని చేస్తేనే అతని ఇంట్లో పూట గడిచే పరిస్థితి. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలిని గ్రామ ప్రజలు,కుటుంబి కు లు కోరుతున్నారు.



