ఈ సృష్టిలో భవంతునికి సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు (రామకోటి రామరాజు )
గజ్వేల్ , ఆగస్టు 26
కృష్ణాష్టమి పురస్కరించుకొని వినూతనంగా నల్లనయ్య శ్రీకృష్ణునికి నల్లని ఉలువలను ఉపయోగించి అత్య అద్భుతంగా కృష్ణుని చిత్రాన్ని రూపొందించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు .
ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు బొధించిన భగవత్ గీత ప్రతి ఒక్కరు చదవాలన్నారు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని మర్చిపోవొద్దు అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జణుడికి ఉపదేశించిన ప్రతి శ్లోకం సకల మానవాళికి ఉపయోగపడే జీవిత పాఠం అన్నారు.
