ప్రాంతీయం

బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలి – బిజెపి

86 Views

*బేషరతుగా రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేయాలి – అదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్ *

*భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల (వర్క్ షాప్) కార్యక్రమంలో భాగంగా త్వరలో జరిగే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం పై జిల్లా స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదిలాబాద్ శాసన సభ్యులు, బీజేపీ శాసన సభ పక్ష ఉపనేత పాయాల్ శంకర్  ముఖ్య అతిథిగా పాల్గొని నభ్యత్వ నమోదు పై దిశ నిర్దేశం చేయడం జరిగింది.*

ఈ సందర్భంగా పాయల్ శంకర్  మాట్లాడుతూ త్వరలో జాతీయ స్థాయిలో ప్రారంభం అయ్యే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి గ్రామంలో, వార్డుల్లో ఇంటి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ పొందటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భారీ ఎత్తున పార్టీ ఇచ్చిన లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయలు రుణ మాఫీ చేయకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రుణ మాఫీ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక అనేక షరతులు పెట్టి అర్హులైన రైతులకు రుణ మాఫీ కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణ మాఫీ బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముల్కల్ల మల్లారెడ్డి, కొయ్యాల ఎమాజి, మున్న రాజా సిసోడియా, ఎనగందుల కృష్ణ మూర్తి, రజనీష్ జైన్, దుర్గం అశోక్, అమరాజుల శ్రీదేవి, బుస నరసింహులు, ముదాం మల్లేష్, అక్కల రమేష్, జిల్లా నాయకులు, మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్