ముస్తాబాద్, మార్చి 13 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం ఆవరణలో ఆధ్యాత్మిక భాగంగా శివ కేశవ కమిటీ ఆధ్వర్యంలో కామ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ ప్రధాన కార్యదర్శి సద్దిమధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు జరుపుకోవడం విశేషం.. హోలీ అనేది సత్య యుగంనుండి మొదలైందని మన పూర్వీకులద్వార వస్తుందని పెద్దలు తెలిపిన విషయమే అన్నారు. కామ దహనం స్థానిక శివకేశ ఆలయంవద్ద ఆలయ కమిటీ, చైర్మన్ ఎలుసాని దేవయ్య, మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గ్రామ భక్తుల ఆధ్వర్యంలో కామ దహనం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శివ కేశవ ఆలయ కమిటీ, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
