పెద్దపెల్లి జిల్లా,గోదావరిఖని.
నిస్సహాయుల ఆశ్రమంలో రక్షాబంధన్ వేడుకలు గోదావరిఖని గాంధీ నగర్ లోని ,ఎం డి హెచ్ డబ్ల్యూ ఎస్ నిస్సహాయుల పిల్లల ఆశ్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, లైఫ్ స్టైల్ బ్యూటీ కేర్ , ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సురభి శ్రీలేఖ సహకారంతో చిన్నారి సహస్ర చేతుల మీదుగా ఆశ్రమంలోని పిల్లలకు రాఖి కట్టి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్. డాక్టర్,సురభి శ్రీధర్ మాట్లాడారు. బాలల సంరక్షణ సంస్థలోని నిస్సహాయ పిల్లలకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారి సహస్ర చేతుల మీదుగా రాఖి కట్టించి రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
రక్తం పంచుకొని పుడితేనే రక్తసంబంధీకులు అనుకోవడం కాదు అని, రక్తం పంచుకుని పుట్టకపోయినా ఎదుటివారికి నేనున్నాను అని భరోసా కల్పించే ప్రతి వ్యక్తి రక్త సంబంధికుడే అని అన్నారు. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని దానిలో భాగంగానే నిస్సహాయుల ఆశ్రమంలో రక్షబంధన్ వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో 27డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వల సంజీవ్ శిరీష, ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి బైరిమల దుర్గాప్రసాద్, ఆశ్రమ నిర్వాహకులు రాజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
