రాజకీయం

రుణమాఫీ పై రైతులు ఆందోళన చెందవద్దు

82 Views

– మర్కుక్,మండల వ్యవసాయ అధికారి, టి.నాగేందర్ రెడ్డి

రైతు రుణమాఫీ 2024 సంబంధించి మూడు విడతల్లో రైతులకు చెందిన రుణమాఫీ ఖాతాలో నిధులు జమ కాబడినవి మర్కుక్,మండల వ్యవసాయ అధికారి టి.నాగేందర్ రెడ్డి తెలియజేశారు.
కొన్ని సాంకేతిక కారణాలు అనగా బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్లో ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు వంటి కారణాలవల్ల మరి కొంతమంది రైతులకు చెందిన రుణ ఖాతాల్లో నిధులు జమకాబడలేదు ఈ రైతులకు చెందిన విజ్ఞప్తులను ఫిర్యాదులను స్వీకరించడానికి మండల వ్యవసాయ కార్యాలయంలో, మర్కుక్ రైతువేదిక లో మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుండి విజ్ఞప్తులను మరియు ఫిర్యాదులను తీసుకోవడం జరుగుతుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రెండు లక్షల పైబడి రుణం కలిగిన రైతులకు రెండు లక్షల పోగా మిగతా రుణం తిరిగి చెల్లించడానికి చాలామంది రైతులు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రైతులకు సంబంధించి ప్రభుత్వం నుండి రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఆదేశాలు వెలువడతాయని అప్పటివరకు రైతులు వేచి చూడాలని రుణమాఫీకి సంబంధించి ఎలాంటి విజ్ఞప్తులు సమస్యలు సందేహాలు ఉన్న మండల వ్యవసాయ అధికారులు సంప్రదించాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. 12-12-2018 నుండి 09-12-2023
గడువు లోపు రుణం పొందిన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని జీవో నెంబర్ 567 ప్రకారం
రైతులకు రుణమాఫీ అందుతుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా మండల వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విజ్ఞప్తుల విభాగాన్ని సందర్శించి తమ ఫిర్యాదులను అందించాలని రైతులను కోరడమైనది.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్