
గజ్వేల్ నియోజకవర్గంలోనీ కుకునూరుపల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామానికి చెందిన కుక్కల పెద్దులు నిన్న రాత్రి జగదేవపూర్ మండల సమీపంలో రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే కాగా ఆదివారం విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దులు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట జగదేవపూర్ మండల PACS చైర్మన్ ఇంద్రసేనారెడ్డి. సర్పంచ్ పావని కనకరాజు,గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీశైలం.మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గ్రామ నాయకులు చంద్రం, గణేష్,కొండస్వామి తదితరులు ఉన్నారు.




