దౌల్తాబాద్: పాము కాటుకు గురై పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుని కథనం ప్రకారం… గ్రామానికి చెందిన రైతు సున్నపు బుచ్చయ్య ఉదయం తన పాడి గేదెను మేత మేపడం కోసం పొలాల వద్దకు తీసుకెళ్లి పొడవాటి తాడుతో కట్టేశాడు. మధ్యాహ్నం వెళ్లి చూసేసరికి గేదె మృతి చెంది కనిపించింది. పాము కాటుకు గురికావడంతో గేదె మృతి చెందిందని బాధితుడు తెలిపారు. పాడి గేదె విలువ సుమారు యాబై వేల రూపాయల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నారు.
