ప్రాంతీయం

సిద్దిపేట కేంద్రియా విశ్వ విద్యాలయాన్ని నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించిన – జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

102 Views

 

మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కేంద్రీయ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యాలయం నిర్మించనున్నట్లు మ్యాప్ ను చుపిస్తు ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనే విషయాలను అధికారులు తెలిపారు. ప్రక్కన ఉన్న కరెంట్ జంక్షన్ యొక్క తీగలను విద్యాలయ క్యాంపస్ ఆవరణ బయట నుండి వెళ్ళెలా అమర్చూకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. విద్యాలయంకి మద్యలో తారు రోడ్డు వస్తున్నందున వేరె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే రోడ్డును తొలగించాలి. కేంద్రియ విశ్వ విద్యాలయం అనేది గవర్నమెంట్ ఆప్ ఇండియాకు సంబంధించినది పెద్ద ప్రాజెక్టు కావునా ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్తగా మ్యాపింగ్ చేసి భవిష్యత్ లో సైతం ఇంకా కొనసాగింపుగా, ఉపయోగపడే విదంగా ప్రణాళికలతో నిర్మించాలని తెలిపారు. సకాలంలో నిర్మించి విశ్వ విద్యాలయాన్ని మరుసటి ఎడాదిలోపు పనులు పూర్తి చేసి ప్రారంభించడమే మంత్రి హరీష్ రావు ఉద్దేశం అని అదికారుకు తెలిపారు.

అనంతరం జిల్లా జైలుకు కేటాయించిన స్థలాన్ని చూడడం జరిగింది. కలెక్టర్ వెంట విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రభాకర్, సిద్దిపేట అర్బన్ తహాసిల్దార్ విద్యాసాగర్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka