ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి) నిరుపేద కుటుంబంపై విధి వక్రీకరించడంతో వీధిన పడ్డ కుటుంబం. రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన దండు రాజు వయసు 35సం” అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కనిండని బీద బతుకులకు గుంట భూమి లేకపోవడం గమనార్హం. దహన సంస్కారాల ఖర్చులు లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో దహనం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉండగా ఒకరు 16, ఒకరు9 సంవత్సరాలు వీరికి దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సహాయం చేయాలని స్థానికులు కోరారు. ఫోన్ పే9989935154 అదేవిధంగా వీరిని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
