ప్రాంతీయం

గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

160 Views
  1. పోషక విలువలు ఉన్న పదార్థాలను తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సూరంపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొల్లం స్వామి, అంగన్వాడీ టీచర్లు బలవ్వ, నాగరాణి, రజని అన్నారు. బుధవారం రోజున సూరంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పాక్షోత్సవాల్లో భాగంగా చిరుధాన్యాలు, పోషకాహార వినియోగంపై అవగాహన నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం రోజు తీసుకునే భోజనంతోపాటు చిరుధాన్యాలు కలిపి తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారం తీసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *