ప్రాంతీయం

బిజెపి..ఆధ్వర్యంలో చిత్రపటానికి క్షీరాభిషేకం…

112 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేసిన దాడిని ఖండిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహంవద్ద మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అడిగిన మాఅన్న బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్రమీద దాడిచేయడం హేయమైన చర్య మీదాడులకు మేము భయపడేది లేదు గతంలోనే ఒక పెద్ద మనిషి పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు మీపరిస్థితి కూడా అలా కాకుండా చూసుకునే బాధ్యత మీదేనని ఒక ప్రతిపక్షాన కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నానీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏల్లగిరిధర్ రెడ్డి, బాధ నరేష్, తిరుపతి యాదవ్, గోపి, గూడ బాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివ, వంశి తదితరులు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7