ఈ జెండాను రూపొందించి దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు
గజ్వేల్ , ఆగస్టు 15
78వ స్వాత్రంత్ర దినోత్సవ శుభ సందర్బంగా వినూతన ఆలోచనలతో 10కిలోల పప్పు ధాన్యాలతో 10అడుగుల రేపరేపలాడే భారీ మువ్వన్నెల జెండాను 2రోజులు శ్రమించి అత్యంత అద్భుతంగా చిత్రించి గురువారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఎకత్వానికి ప్రతీక మన భారదేశం అన్నారు. ఎ తల్లి నినుగన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదన్నారు. అటువంటి భరతభూమి చిత్రాన్ని నా కళతో ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనతో చిత్రించి ఆ తల్లి ఋణం తీర్చుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్ననన్నారు. కాషాయంకు ఎర్రపప్పు, తెలుపుకు బియ్యం, ఆకుపచ్చకు పెసరపప్పు వాడానని తెలుపారు.
