సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం పురాతన ఊడల మర్రి చెట్టు బంగారు మైసమ్మ తల్లి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు తలకొక్కుల లక్ష్మణ్, కుటుంబ సభ్యులు, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పురాతన బంగారు మైసమ్మ తల్లి విగ్రహం పునః ప్రతిష్ట మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,కౌన్సిలర్స్, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దుర్గం స్వామి, కొండపోచమ్మ దేవాలయం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ డీలర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గుజ్జ వెంకటేశం, తుమ్మ శ్రీనివాస్, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు, గజ్వేల్ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు




