ఆధ్యాత్మికం

పూర్ణాహుతితో ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు

143 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం దత్తత శివాలయంలో శనివారం ఉదయం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి శుక్రవారం అర్ధరాత్రి కళ్యాణం అనంతరం కళ్యాణం లడ్డును వేలంపాట వేయగా 6 వేల రూపాయలకు ఎలవేని లింగం దక్కించుకున్నారు.

అలాగే భక్తులకు నిమ్మ బుచ్చిరెడ్డి మోతే లక్ష్మారెడ్డి పండ్లు సిరా ప్రసాదాలను వితరణ చేశారు. అర్చకులు వేణుగోపాల చారి లింగోద్భవ కార్యక్రమాన్ని భక్తులతో అభిషేకాలు చేయించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి దొమ్మాటి నర్సయ్య మాజీ ఉపసర్పంచ్ మహేందర్ ఎంపీటీసీ అపేరా సుల్తానా ఆలయ కమిటీ చైర్మన్ సూర నర్సయ్య నిమ్మ సుధాకర్ రెడ్డి బొమ్మెడి భాస్కర్ భక్తులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7