ప్రాంతీయం

బిజెపి యువ మోర్చా బైక్ ర్యాలీ – బిజెపి పార్టీ

48 Views

భీమారం బీజేపి యువ మోర్చ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలి.
భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  రాష్ట్ర అధ్యక్షులు కేంద్రబొగ్గు ఘనులశాక మంత్రి వర్యులు గౌ.శ్రీ, జి, కిషన్ రెడ్డి, జిల్లా అద్యక్షులు వెర్రబెల్లి రఘునాత్ రావ్, జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం అశోక్ ,అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్  పిలుపు మేరకు “హర్ ఘర్ తిరంగ యాత్రలో బాగంగా బైక్ ర్యాలీ ఈరోజు భీమారం బీజేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల వేపలబోడ నుండి కొత్తగూడెం వరకు యువమోర్చ నాయకులతో కలసి బైక్ పై,తిరంగ ర్యాలీ తీయడం జరిగింది అనతరం 77.వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై జాతీయ జెండా ఎగుర వేయాలని మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్  పిలుపునిచ్చారు.

అనంతరం మండల ప్రధానకార్యదర్షి మాడెం శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే  ఎన్నికల సందర్బంలో ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇక్కడి యువతకు నలభై వేల ఉద్యోగాలు కల్పిస్తానని ఇప్పటివరకు ఒక్కరికీ కూడ ఇప్పించలేదన్నారు కాని తన కుమారుడికి మాత్రం ఇప్పించు కున్నాడని ఇప్పటికైనా ఇచ్చిన హామీ యువతకు నలభై వేల ఉద్యోగాలు కల్పించాలని కోరడం జరిగింది ఈకార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆలం బాపు, ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్, ఆవిడపు సురేష్,దుర్గం కత్తెరసాల, ఆకుదారి శెంకర్, ఆకుదారి మల్లేష్, సెగ్గెం మల్లేష్, మంతెన సుధాకర్,దుర్గం మహేష్ , ఆకుదారి లచ్చన్న, యువమోర్చ అధ్యక్షులు సెగ్గెం సందేపు, ప్రధాకార్యదర్శి దూట వినోద్, మహిళ మోర్చ అధ్యక్షురాలు మేడి విజయ కొత్తపెల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్