– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
దౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు అంకితం కాకుండా క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థులు క్రీడలు చక్కగా ఆడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఏ ఆటలు ఎంచుకుంటే ఆ ఆటల్లోనే ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ ప్రభాకర్, సర్పంచ్ కేత కనకరాజు, ప్రిన్సిపల్ శోభారాణి, పీడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…