శాశ్వతమైన నామం భగవన్నామం ఒకటే అన్నారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్బంగా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దత్త అని పలికిన, స్మరించిన వెంటనే సంతుష్టి చెంది అనుగ్రహించే స్వామి దత్తాత్రేయ స్వామి అని అన్నారు. ప్రపంచంలో అన్ని నశిస్తాయి కానీ భక్తి నశించదన్నారు. శాశ్వతమైనది నామం భగవన్నామము ఒకటే అన్నారు.
