ముస్తాబాద్ , ఆగస్టు 12 (24/7న్యూస్ ప్రతినిధి): గతంలో నేరాలకు గురైన వారు ప్రస్తుత సమాజంలో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరం ఉందని ఎస్సై గణేష్ అన్నారు. ముస్తాబాద్ మండల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు పోలీస్ స్టేషన్ పిలిపించి వినూత్న కౌన్సిలింగ్ ఇచ్చి పలు సూచనలు చేశారు. నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండలేక అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారుమళ్లీ ఎలాంటి తగాదాలలో కుటుంబ విషయాలలో తల దూర్చారని ఉత్తమ ప్రవర్తనతో జీవించాలన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన హింసకు గురిచేసిన తక్షణ చర్యలు తప్పవు. ఎక్కడ జరిగిన గొడవ నిరంతరం మీపై నిఘా ఉంటుందని ఏచిన్న తప్పు చేసినా ఉపేక్షించేది ఉండదన్నారు. పెళ్లయిన వారైతే మీపిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మార్పు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఉత్తమ నడవడిక కలిగిన రౌడీ షీట్లను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచించబడింది.
