భీమారం మండల అధ్యక్షులు బోర్ల కుంట శెంకర్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈయెక్క కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాపర్తి వెంకన్న, జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ అసెంబ్లీ కంటిస్టెంట్ అభ్యర్ధి దుర్గం అశోక్ , అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్ , మండల ఇంచార్జీ ఆలం బాపు, పాల్గొన్నారు.
ఈకార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటివరకు పూర్తి చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపి పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయాలని తీర్మానం చేయడం జరిగింది , కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి మహిళలకు ప్రతినెల రూ 2,500 ఇస్తామని మోసం, కౌలు రైతులకు కూడా రైతు బరోసా రూ15,000 వేలు ఇస్తామని రైతులను మోసం చేసింది. అదేవిదంగా ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి రూ.12,000 వేలు ఇస్తామని మోసం వృద్దులకు రూ.4,000 వేలు ఇస్తామని మోసం వికలాంగులకు రూ.6,000 వేలు ఇస్తామని మోసం పద్దెనిమిది ఏండ్లు నిండిన విద్యార్థినులకు బైక్ లు ఇస్తామని మోసం కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.100,000 తో పాటు తులం బంగారం ఇస్తామని మోసం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4,000 వేలు ఇస్తామని మోసం ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసంచేసింది అదేవిదంగా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ,ఎలక్షన్ టైంలో చెన్నూరు యువతకు 40,000 వేల ఉద్యోగాలు ఇస్తానని ఇప్పటివరకు దాని ఊసెలేదు. ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన నలభై వేల ఉద్యోగాల హామీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపి పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయాలని తీర్మానం చేయడం జరిగింది,
ఈకార్యక్రమంలో మండల ప్రధానకార్యర్షులు మాడెం శ్రీనివాస్ , వేల్పుల రాజేష్, ఉపాధ్యక్షులు కొమ్ము దుషాంత్ యాదవ్, గజ్జెల సురేష్,దుర్గం కత్తెరసాల, ఆకుదారి శెంకర్ ఆకుదారి మల్లేష్, ఏల్పుల సతీష్, బీసీ, మోర్చ ఆవిడపు సురేష్, ఎస్ సి, మోర్చ సెగ్గెం మల్లేష్, అనపర్తి రాజమల్లయ్య, మహిళ మోర్ష మేడి విజయ,యువ మోర్చ సెగ్గెం సందీప్, ప్రధానకార్యదర్శి దూట వినోద్, దుర్గం మహేష్, సకినారపు మల్లేష్, మంతెన సుధాకర్ లు పాల్గొన్నారు.
