కోటి తలంబ్రాల దీక్షలో ( ఎం ఈ ఓ) యెలగందుల కృష్ణ దంపతులు
గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు
కల్యాణ రాముని మాచే గోటి తలంబ్రాలు మహభాగ్యం
సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చ్ 12
భద్రాచల సీతారాముల కళ్యానానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో బుధవారం గజ్వేల్ ( ఎం ఈ ఓ) యెలగందుల కృష్ణ దంపతులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను వలిచారు. అనంతరం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి అందజేసి రామభక్తిని చాటుకున్నారు.
అనంతరం( ఎం ఈ ఓ ) యెలగందుల కృష్ణ మాట్లాడుతూ మా చేతులతో ఓలిచిన ఈ గోటి తలంబ్రాలు భద్రాచల కల్యానానికి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పుణ్య కార్యక్రమంలో మమ్మల్ని కూడా బాగా స్వాములను చేసిన రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోగం అన్నారు. ఈ సందర్బంగా కృష్ణ దంపతులను సన్మానించిన సీతారాముల జ్ఞాపికను అందజేశారు.





