ప్రాంతీయం

మంచిర్యాలలో పెట్టుబడిదారులు ముందుకు రావాలి

36 Views

మంచిర్యాల సమీపంలో ని వెంపల్లిలో 250 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఇండస్ట్రీయల్ హబ్,ఐ టి పార్కు లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు.

గురువారం మంచిర్యాల లో వ్యాపారస్తులు, పెట్టుబడిదారులతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. కొద్దీ రోజుల్లో ఇండస్ర్టీయల్ హబ్ ,ఐ టి పార్కు కు అంకురార్పణ చేస్తున్నట్లు హర్షధ్వానాలు మధ్య ప్రకటించారు. ఇప్పటికే భూ సేకరణ జరిగిందన్నారు. వ్యాపారులు ముందుకు వస్తే భూమి కేటాయింపులో జాప్యం లేకుండా కేటాయింపు జరుగుతుందని భరోసా ఇచ్చారు. విద్యుత్, నీరు, రహదారి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కోటి రూపాయల నుంచి 100 కోట్లకు పైగా వ్యాపారాలు చేయడానికి ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. ఖనిజ, బొగ్గు వనరులతో పాటు రైల్వే రవాణా మార్గం ఉండడం వ్యాపారులకు సౌలభ్యమన్నారు. అంతే కాకుండా సమీపంలో ఎయిర్ పోర్ట్ కూడా ఏర్పాటు కానున్నట్లు తెలిపారు.

  1. ఈకార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మల్సూర్ ,TGIAC Executive director నిఖిల్ చక్రవర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్