అల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్
హైదరాబాద్ డిసెంబర్ 17
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు. రానా నుంచి విజయ్ దేవరకొండ దాకా, దిల్ రాజు నుంచి నాగవంశీ వరకు స్టార్లంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు.
నేరుగా అక్కడికే..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హైదరాబాద్ పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు పోలీసులు. ఈ కేసులో క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే బన్నీకి బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్. దీంతో ఆయన జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆయన బెయిల్ రద్దు కోసం నేరుగా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు హైదరాబాద్ పోలీసులు. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది..





