ప్రాంతీయం

కోదండరామ్ ను కలిసిన తెలంగాణ ఉద్యమ కళాకారులు

50 Views

గజ్వేల్ , ఆగస్టు 7

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో ఎంతో మంది కళాకారులు ఇల్లు పిల్లలను వదిలి రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో గోసి గొంగడి వేసి
పల్లెపల్లెల్లో ప్రజలను చైతన్యం చేసి పోలీసుల లాటిదెబ్బలు, కేసులకు సైతం భయపడకుండా ఉద్యమాన్ని ఉదృతం చేసిన ఉద్యమ కళాకారులకు తీరని అన్యాయం చేసిందని ,
కళాకారులకు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం సాంస్కృతిక సారథి పెట్టీ ఎలాంటి నోటిఫికేషన్, ప్రకటన లేకుండా 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు .
కానీ అప్పటి చైర్మెన్ రసమయి బాలకిషన్ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేనివారికి తనకు నచ్చినవారికి ,
వారిఅనుచరులకు డైరెక్ట్ గా కాల్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.
నిజంగా ఉద్యమంచేసిన ఉద్యమ కళాకారులకు అన్యాయం చేశారు .
ఇదేంటని అడిగితే రెండవ లిస్ట్ లో ఇస్తామని చెప్పి ఎన్నిసార్లు అప్పటి మంత్రులను కలిసి మా బాధలు మొరపెట్టుకున్నా కనికరం చూపలేదని ,
దయచేసి ఇప్పుడయిన సాంస్కృతిక సారధీలో అర్హతలేని వారిని తొలగించి నిజమైన ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి
మాపేద ఉద్యమ కళాకారులకు అండగా ఉండాలని వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కల వేదిక గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి సోం నరేష్, రాష్ట్ర సభ్యులు బండకాడి గణేష్, కల్వకుంట్ల స్వామి, చిన్నగుండేల్లి పరమేష్, రాజక్కపేట రమేష్, అందే ప్రవీణ్ లు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్