ప్రాంతీయం

రామకోటి రామరాజు కు సేవారత్న పురస్కారం అందజేత

37 Views

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి బుధవారం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో లక్ష్మీ ప్రసన్న చారిటేబుల్ సంస్థ వారు ఉత్తమ సేవా పురస్కారాలను ప్రధానం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గత 25సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక, సామాజిక సేవలను గుర్తించి సేవారత్న పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు ఇంటర్ నేషనల్ వైశ్య పెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్, ప్రజా ఉద్యమ గాయకుడు ఏపూరి సోమ్మన్న. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు లక్ష్మీ ప్రసన్న, సామ శ్రీధర్, పంజాల వెంకటేష్ గౌడ్, సామ ప్రశాంతి, వంగపల్లి అంజయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka