(శంకరపట్నం ఆగస్టు 08)
శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి విరోచనాలతో బాధపడగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపి మాధవ రాజుకు చెందిన మధు క్లినిక్ వైద్యుని వద్ద కు వెళ్లి ఈ నెల 5న వైద్యం చేయించుకోగా ఆర్ఎంపి ఐవి సెలైన్ పెట్టడంతో పాటు రెండు యాంటీబయోటిక్ ఇంజక్షన్లు ఇచ్చాడు.దీంతో లక్ష్మయ్య విపరీతమైన చలితో వణికిపోయాడు ఇంటికి తీసుకువెళ్లి పడుకోబెట్టండని ఆర్ఎంపి చెప్పడంతో ఇంటికి తీసుకువెళ్లారు.అయినా చలి తగ్గకపోవడంతో మళ్లీ కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వద్దకు తీసుకురాగా మరో రెండు ఇంజక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.దీంతో కాసేపటికి మాట పడిపోవడం, నడవలేని స్థితిలోకి వెళ్లిపోవడంతో హనుమకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్త పల్లి రవి తెలిపారు.




