భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట గ్రామంలో నిన్న జరిగిన గణేష్ నిమజ్జనం రోజున శోభాయాత్ర సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యువకులపై దుర్భాషలాడుతూ అక్రమంగా 40 మంది హిందూ యువకులపై కేసులు పెట్టడం జరిగింది గత ఏడాది కూడా ఇదే మాదిరిగా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అక్రమంగా కేసులు పెట్టిన యువకులపై వెంటనే కేసులు తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు సిఐ మొగిలి ఎస్సై శేఖర్ పోలీస్ అధికారులు నాయకులకు నచ్చజెప్పి వారిపై ఉన్న కేసులను ఉన్నత అధికారులతో మాట్లాడి తొలగిస్తామని స్పష్టమైన హామీ హామీ ఇచ్చారు దానితో నాయకులు ఆందోళన విరమించారు ఇకపై పోలీసు అధికారులు హిందూ యువకులపై హిందూ కార్యక్రమాలపై ఆంక్షలు విధించినట్టయితే భవిష్యత్తులో మరింత ఆందోళన నిర్వహిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలకు వ్యతిరేకంగాఆంక్షలు విధించడం తగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుండాట వెంక రెడ్డి జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి జిల్లా అధికార ప్రతినిధులు నెవూరి దేవేందర్ రెడ్డి బాందారపు లక్ష్మారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ పట్టణ అధ్యక్షుడు నెవూరి శ్రీనివాస్ రెడ్డి , బొమ్మడి స్వామి దూస శ్రీనివాసు రేపాక రామచంద్రారెడ్డి సాయి కిరణ్ మహేష్ దాసరి గణేష్ లక్ష్మణ్ తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
