నేడు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు బస్టాండ్ లో టిఎస్ఆర్టిసి లహరి స్లీపర్ క్లాస్ బస్సును చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
చెన్నూర్ నుండి హైదరాబాద్ కు నూతనంగా ఏర్పాటు చేసిన టీ.ఎస్.ఆర్.టీ.సీ లహరి స్లీపర్ క్లాస్ బస్ ను రిబ్బన్ కట్ చేసి చెన్నూర్ బస్ స్టాండ్ లో ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తరువాత ఆయన మాట్లాడుతూ చెన్నూర్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఈ స్లీపర్ క్లాస్ బస్సులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు టీఎస్ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రయాణికులు పాల్గొన్నారు.
