ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసులు పెట్టి చంపుతా అని బెదిరింపు
న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థని అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని
ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు
కమిషనర్ వద్దకు వెళ్లిన న్యాయం జరగలేదని బాధితుల ఆవేదన
సిద్దిపేట జిల్లా జూన్ 14
సిద్దిపేట జిల్లా ఫ్రీ లాంచింగ్ అనే రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేదల వద్ద దాదాపు కోటి రూపాయలు దోచుకున్న మర్కుక్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు .
వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలుగా మర్కుక్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా నిధులు నిర్వర్తిస్తూ తన అన్న కొడుకులతో రియల్ ఎస్టేట్ ఫ్రీ లాంచింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అనే పేరుతో చిన్న చిన్న వ్యాపారులతో మాయ మాటలు చెప్పి హెడ్ కానిస్టేబుల్ బాలరాజు ఈ దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ వాస్తవ్యులు హిరాలాల్ సోనీ, పొన్నాడా వీరప్రసాద్, శ్రీధర్,పాకనాగ రాజు, రామిడి ప్రేమ్ రెడ్డి వద్ద యాదగిరిగుట్ట సమీపంలో ఫేక్ వెంచర్ లోని ప్లాట్లను చూపించి దాదాపు ఒక కోటి ఏడు లక్షల రూపాయలు తీసుకొని గత ఆరు నెలల నుండి తప్పించుకొని తిరుగుతూ అడిగితే బాధితులను బెదిరింపులకు పాల్పడ్డాడు.
బెదిరింపులు తట్టుకోలేక బాధితులు సిద్దిపేట కమిషనర్ దగ్గర ఈ నెల మూడవ తేదీన వెళ్లి తమ బాధను వెళ్ళబుచుకున్నారు.
కమిషనర్ ముందు ఇస్తానని చెప్పి ఆ తర్వాత రోజు నుండి మళ్లీ బెదిరిస్తున్నారని బాధితులు స్థానిక సీఐ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
కమిషనర్ మరియు సిఐ దగ్గరకి వెళ్లి ఫిర్యాదు ఇచ్చిన ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం రోజున మర్కుక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ బాలరాజు మీద ఇచ్చిన చెక్కులను మరియు బాధితులు అకౌంటు లో వేసిన నగదు రసీదును తీసుకొని కంప్లైంట్ ఇచ్చారు
న్యాయం చేయవలసిన పోలీస్ వ్యవస్థని అన్యాయాలకు పాల్పడితే నిరుపేద ప్రజలు ఎలా బ్రతకాలి అంటూ బాధితులు మర్కుక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
