(తిమ్మాపూర్ ఆగస్టు 02)
ఎస్సీ కులాల వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాదిగ, మాదిగ ఉప కులాలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సిరిసిల్ల శంకర్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా అలుగనూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బొయిని కొమరయ్య, మాతంగి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు ఎస్సీ సామాజిక వర్గంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని అందుకు ఎస్సీ కులంలో ఏ.బీ.సీ.డి వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మి 30 ఏళ్ల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వ్యవస్థను స్థాపించి అలుపెరుగని పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితం నేడు సాకారమైందని తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల వారు చేసిన పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈ తీర్పు అంకితం అని తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ సామాజిక వర్గంలోని అన్ని కులాల వారిని కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మేధావులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకీ అనిల్ కుమార్, జిల్లా నాయకులూ కన్నం నర్సయ్య, కన్నం మల్లేశం, నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్, మధు,అనిల్,నర్సయ్య, అంజయ్య,బామండ్ల శివ కుమార్, కన్నం భూమయ్య,అలువాల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…