*గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామంలోని సేవాలాల్ తండాలో గల ప్రాథమిక పాఠశాల పాత భవనం శిథిలావస్థలో ఉన్న నేపధ్యంలో ఆ భవనాన్ని కూల్చివేసి అదే ప్రదేశంలో నూతన భవన నిర్మాణానికి ఈరోజు భూమిపూజ చేయడం జరిగింది.. CSR నిధుల నుండి సుమారుగా 1800000/-లక్షల (₹ పద్దెనిమిది లక్షల) అంచనా విలువతో ఈ పాఠశాల పునర్నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు.. త్వరితగతిన పనులు పూర్తి చేసి త్వరలోనే పాఠశాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.. ఈ సందర్భంగా నిధులు మంజూరుకు సహకరించిన KTR గారికి గ్రామ ప్రజలు , గ్రామ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు*.
*ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతినేని చైతన్య-వెంకట్రావు, ఎంపీటీసీ బెందే రేణుక- కృష్ణమూర్తి, ఉపసర్పంచ్ దుబాసి రాజు, TRS గ్రామ శాఖ అధ్యక్షులు బిల్ల వేణుగోపాల్, సోషల్ మీడియా వారియర్ మెండే సుమన్, వర్డ్ సభ్యురాలు మినా, నాయకులు షేర్పల్లి శంకర్, బాపురావ్ నాయక్, దర్సింగ్ నాయక్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు