ఎల్లారెడ్డిపేట మండలంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, రాచర్ల బొప్పాపూర్ జ్ఞాన దీప్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలబాలికలు చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. వెన్నకుండలతో బాలబాలికల హడావుడి ముచ్చటగొలిపింది. పిల్లనగ్రోవితో చిన్నారులు ఆటా పాటలు అందరినీ అలరించాయి.పాఠశాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు పలు వేషధారణల్లో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా ఉట్లు కొట్టే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ మొహమ్మద్ లతీఫ్ ప్రిన్సిపాల్ శరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా పాఠశాలల్లో ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లల్లో చైతన్యం వస్తుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.