సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయం వైపు నిలిచింది ఉమ్మడి మెదక్ జిల్లా మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా మాజీ అధ్యక్షుడు సింహాచలం మాదిగ అన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ చేయాలని అనేక రకాల పోరాటాలను తీసుకొని కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగా సామాజిక న్యాయాన్ని గ్రహించి ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ అవసరమని ఇవ్వడం సామాజిక న్యాయం వైపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టే అన్నారు. ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని ఎంతో మంది జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని ఎంతోమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. 2005లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను కొట్టివేసిన తర్వాత మళ్లీ ఉద్యమన్ని తీవ్రస్థాయికి తీసుకుపోవడానికి కృషి చేసిన మందకృష్ణ మాదిగ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు ఎస్సీ ఎస్టి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాతనే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ mపై వచ్చిన తీర్పును స్వాగతిస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మంతూరి రాములు,డప్పు శ్రీనివాస్, ఉప్పల గంగాధర్, ఆసనోళ్ల చంద్రం, స్వామి,శ్రీనివాస్,కరమల్లని కనకయ్య,ఈదన్నగారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
