పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని సిఐ సైదా అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది తో కలిసి మొక్కలు నాటిన సిఐ సైదా, ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహద పడతాయి అని అన్నారు, నేడు నాటిన మొక్కలే రేపటి వృక్షాలుగా మారి సమాజానికి మేలు కలిగే విధంగా చేస్తాయని, చెట్లు అమ్మ వంటివి అని చెట్లను ప్రతి ఒక్కరు పరిరక్షించాలని, అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సైలు శంకర్, యాదగిరి రెడ్డి, ఏఎస్ఐ పాండరి, పీసీ స్వామి గౌడ్, అమర్, భవాని ,స్వాతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.




